Mytales

ప్రేమంటే Author - Sarita Oruvala Sarita 3నిమిషాలు నిమిషాలు చదవండి dum

ప్రేమంటే

 

నేటి కాలంలో ప్రేమ చిరునామా
దొరకబుచ్చుకోవడం
కాసింత కష్టమేనేమో

బరి తెగించి కొందరు
బాధ్యతమరిచి ఇంకొందరు
దేహాలపై వ్యామోహంతో
ఒకరితో ఒకరు అవసర నిమిత్తం
ఏర్పర్చుకునే సంబంధం
దానికి పెట్టే పేరు "ప్రేమ"
ఇంకా...
అందాన్ని చూసి పుట్టే ప్రేమ
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లు,
దేహాన్ని చూసి కలిగే
దాహపు ఎదురు చూపులు,
మనస్పర్ధలు వచ్చినపుడు
మనుషుల మధ్య బ్రేకప్ లు,
మంచిగా ఉన్నపుడు
మళ్లీ మళ్లీ కలయికలు,
కాదంటే కఠినమైన దాడులు,
ఒకరిపై మోజు తీరగానే
మరొకరి పై మనసు పడడాలు,
ఉన్న చోట పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి...
అనువైన ,అన్నీ ఉన్న ఆడంబరాలను చూసి
మనసు పారేసుకోవడం,
ఇంటి వారిని మభ్య పెట్టి
ఐహిక సుఖం కోసం
క్రమ శిక్షణ లేని
అక్రమ సంబంధాలు,
కాదు కదా ప్రేమంటే.
.ల

ప్రేమ పవిత్రమైనది
బంధం బాధ్యతాయుతమైనది
ప్రేమతో కూడిన బంధం
ఆత్మీయమైనది
అది అందరికీ అర్ధం కాదు...
అర్ధం లేని అక్రమ బంధాలు
నడిపే ,విలువలు లేని,
దేహం మీద వ్యామోహం గల,
దుష్ట జనులకు ఏనాటికీ అర్థం కాదు ప్రేమంటే.

వారు తాము చేసే
ముసుగు మాయాజాలం
తీపి కబురుల దొంగ కాలక్షేపాలు
సొంత మనుషులను
మోసం చేసి
సొంగ కార్చే సొల్లు కబురులు
ఇంటి వారి ని ఇక్కట్లు పెట్టి
పక్కదారి పట్టే ప్రణయబంధాలు

ఇదే ప్రేమను కుంటారు...

....ఇలాంటి వారి వల్ల
ప్రేమ కున్న విలువ పోతుంది.
సంభోగమే ధ్యేయ మై
అనుబంధం ఆనవాలు మాయమైతున్న
ప్రేమ సంబంధాల వలన
నిజంగా ప్రేమించే వాళ్ల ప్రేమ కి
అర్ధం లేకుండా పోతుంది.
మానవ సంబంధాలు
తలదించుకోవాల్సి వస్తుంది ..

సరితనరేష్

Sarita Oruvala Sarita

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 31st January 2018

జనర్ : Romance

రకం : Poem

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 63

ఒక సమీక్షను వ్రాయండి
Be the first to review