Mytales

నిజమైన ప్రేమ Author - Mytales Yourstories 2 నిమిషాలు చదవండి
బిడ్డల ఉన్నతి కోసం తమ సుఖాలను త్యజించే తల్లితండ్రులదే '‌నిజమైన ప్రేమ'...
 
జీవితాంతం ఒకరికొకరు  తోడునీడగా, కలిసి మెలిసి సంసారం సాగించే బార్యాభర్తలదే
'నిజమైన ప్రేమ'...
 
నేటి కాలంలో....
యువతీయువకులు...
 
ప్రేమకు విలువనీయక,
ప్రేమకు అర్దం తెలియక
 
వయసు తెచ్చిన ఆకర్షణకు లోబడి...
అదే నిజమైన ప్రేమని భ్రమపడి...
 
తాను ప్రేమించేవారు తననే ప్రేమించాలని...
అవతలవారికి ఇష్టం లేకున్నా...
తనని ప్రేమించక పోయినా.... 
శాడిజంతో
ఆత్మహత్యలకు పాల్పడుతూ...
యువతులపై యాసిడ్ దాడులు.. కత్తిపోట్లకు గురిచేస్తూ....
నిండుజీవితాలు బలి చేసుకుంటూ...
తల్లితండ్రులను కడుపుకోతకు గురిచేస్తున్నారు.
 
ప్రేమించటం నేరంకాదు.
కాని...
 
ఆ ప్రేమను పొందటంకోసం...నిన్ను ప్రేమించని వారిని హింసించటం  నేరం.
 
ఎదుటి వారి సుఖం కోసం...
తన ప్రేమను త్యాగం చేయడమే'నిజమైన ప్రేమ'.
 
వారణాసి.హైమావతి.

Mytales Yourstories

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 22nd January 2018

జనర్ : LOVE2018

రకం : Poem

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 18

ఒక సమీక్షను వ్రాయండి
Be the first to review