Mytales

ప్రేమంటే.... Author - Mytales Yourstories 2 నిమిషాలు చదవండి

ప్రేమంటే.. పెదవులతో పలికే..
రెండక్షరాల పదం కాదు..

పదాల లో పొదగలేని...
రెండు మనసుల మధురాల రసాస్వదనం...

ప్రేమంటే... అందాల సోయగాలకు
దాసోహం...కాదు

ఆప్యాయతలతో అల్లుకునే..
అనురాగాల సంగమం...

ప్రేమంటే...గుండె గదుల్లో..ఇముడ్చుకునేది కాదు...

పరులకి పంచే కొద్దీ.. తరగని
అమృతభాండం..

ప్రేమంటే. . ఇద్దరి తనువుల తహతహ కాదు...

ఇరువురి.. మనసుల భావజాల పరవశం...

ప్రేమంటే... ఊహల ఊయల కాదు..

ఊపిరులు నందించ గలిగే..
ఉద్విగ్నం...

ప్రేమంటే... తప్పులున్నా..
మన్నించే గుణం కాదు...

అవతలి వారి తప్పొప్పులను
సరిదిద్ద గల స్నేహితం..

ప్రేమంటే.. సుఖ సంతోషాల న మాత్రమే.. పంచుకునే... పట్టు పరుపుల పాన్పు..కాదు..

కష్టాల బాటన కూడా తోడుండి ముళ్ళపానుపు పై పవ్వ ళించే నేస్తం..

ప్రేమ... మానవులకి భగవంతుడిచ్చిన ఒక వరం..

మానవులుగా..ప్రేమను ప్రేమను..ప్రేమించండి...

ప్రేమను ...పంచండి..

అందరి తో.. ప్రేమగా ..జీవించండి..

అదే...
విశ్వ మానవ ప్రేమకు సోపానం...

 

  పోపూరి. మాధవీ లత

Mytales Yourstories

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 3rd January 2018

జనర్ : Action, LOVE2018

రకం : Poem

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 109

ఒక సమీక్షను వ్రాయండి
Be the first to review