Mytales

ప్రేమ గజల్ Author - BV Siva Prasad 5 నిమిషాలు చదవండి dum

ప్రేమ పంచి ఇచ్చేందుకు మనసుంటే చాలు కదా
బ్రతుకు పంట పండేందుకు మమతుంటే చాలు కదా

మనసులోన ఆరిపోని అగ్ని సెగలు రగిలినా
ప్రపంచాన్ని గెలిచేందుకు నవ్వుంటే చాలు కదా

ధనము బలము అధికారము మనదగ్గర లేకున్నా
మంచితనం మానవత కలిగుంటే చాలు కదా

నడచి పోవు దారిలో ముళ్ళున్నా రాళ్ళున్నా
మొక్కవోని గుండెబలము తోడుంటే చాలు కదా

కష్టాలే తరిమినా నష్టాలే పొందినా
కలకాలం వెంటుండే మనసుంటే చాలు కదా

కీర్తి కాదు పేరు వద్దు ఈజన్మకు ఓ’శివుడా’
బతుకంతా మనిషితనం మిగిలుంటే చాలు కదా

BV Siva Prasad

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 2nd January 2018

జనర్ : Romance

రకం : Poem

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 179

ఒక సమీక్షను వ్రాయండి
Srinivas Meenuga ప్రసాద్ గారు, నేను శ్రీనివాస్ (ఫిలిం పరిచయం) మనసు, మమత, నవ్వు, మంచితనం, మానవతా, గుండెబలం, వెంటుందే మనసు, మనిషితనం, బావుంది సర్, చాలాకాలం తరువాత మంచిపదాలన్నీఈ ఒకే చోట, - శ్రీనివాస్ Ramyaka Sammangi Very nice sir Tj Ganesh Entho unnatha vidya pondi kuda, mathru basha mida mikunna makkuva ki joharlu Padmavathi Mullapudi నైస్ gazal V. NARASIMHA SARMA Malladi మనసుపెట్టి మనసుమీద రాసిన మమతానురాగాల మాలిక --- అభినందనలు Anil Atluri నడచి పోవు దారిలో ముళ్ళున్నా రాళ్ళున్నా మొక్కవోని గుండెబలము తోడుంటే చాలు కదా - మంచి మాట!