Mytales

రైతన్న Author - Mytales Yourstories 2 నిమిషాలు చదవండి
దేశానికే వెన్నెముకైన రైతన్న
ఏరువాక రోజున పశువులను పూజించి 
నారువిత్తి... పొలంపనులతో గడిపే రైతన్న.
 
నెర్రలిచ్చిన భూములను చూస్తూ
ఒక్క చినుకైనా పడుతుందేమో అని...
ఆశగా ఆకాశం వంక చూస్తూ...
కాలం గడుపుతున్న రైతన్న.
 
వర్షాభావం వల్ల....
ఋతుపవనాలు తమ ప్రభావం
చూపకపోవటంతో...
దిక్కు తోచని  స్థితిలోని రైతన్న.
 
వర్షాలు పడినా
ప్రభుత్వం అందించిన..
విత్తనాలు విత్తి...
రసాయన మందులు జల్లి..
పండిన పంటకై ఆశగా ఎదురు చూస్తూ....
 
కల్తీ విత్తనాలు, కల్తీ మందులతో
పంటలు సరిగా పండక...
పండిన పంటకు సరైన
గిట్టుబాటు ధర రాక...
మార్కెట్లోని దళారుల చేతికి చిక్కి...
తాము పడిన కష్టానికి...
తగిన ప్రతిఫలం లభించక....
 
సేద్యం చేయలేక భూములను, దాణా పెట్టలేక పశువులను
తెగ నమ్ముకొని
వలసకూలీలుగా వేరే ప్రాంతాలకు వెళ్ళే రైతులు కొందరైతే...
 
తీసుకున్న ఋణాలు చెల్లించలేక ,పంటకై తెచ్చిన రసాయన మందులు తాగి...
ఆత్మహత్యలు చేసుకునే
 రైతులు మరికొందరు...
 
బోరుబావులు తవ్వించి...
కరెంట్ కష్టాలకోర్చి....
అర్ధరాత్రులు కరెంట్ షాక్ లతో
ప్రాణాలు పోయిన రైతులు ఇంకొందరు...
 
పాడి పంటలతో, సిరి సంపదలతో
తులతూగాల్సిన పల్లెలు
దేశానికే అన్నపూర్ణగా పేరు గాంచిన పల్లెలు
మరు భూములుగా మారుతున్నాయి.
 
చిన్నాభిన్నమవుతున్న
రైతుల జీవితాలు...
వారి ఆక్రందనలు, నినాదాలు ప్రభుత్వానికి
వినిపించేనా....?
వారి బ్రతుకులకి భరోసా
వచ్చేనా....?
 
వారణాసి.హైమావతి

Mytales Yourstories

ఈ కథ గురించి

పోస్ట్ చేసిన తేదీ: 25th December 2017

జనర్ : raithu

రకం : Poem

ఇష్టమైన: 0

మొత్తం వీక్షణలు: 32

ఒక సమీక్షను వ్రాయండి
Be the first to review