Mytales

Dr. శివ్ గారి ( బి. వి. శివ ప్రసాద్ ) రచనలు-2017-అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్ - పురస్కార గ్రహీత

స్వీయ పరిచయం

పేరు: బి. వి. శివ ప్రసాద్కలం పేరుశివ్.

ఇప్పటివరకు తెలుగులో యాభైకి పైగా కధలు, వందకు పైగా కవితలు, ఒక నవల, ఒక నాటిక, పది వ్యాసాలు, ఇరవై అనువాద కథలు, కొన్ని గేయాలు, గజళ్ళు వ్రాశారు. ఆంగ్లంలో ఇరవై ఐదు కవితలు, పాతిక వ్యాసాలు, ఒక నాటకం రచించారు. వీరి రచనలు - రచన, స్వాతి, నవ్య, జాగృతి, ఆంధ్ర భూమి వార పత్రిక, 'పత్రిక’, చినుకు, సారంగ సాహిత్య వెబ్ వారపత్రిక, www.mytales.co.in  సాహితీ కిరణం, రమ్యభారతి, విపుల, బాల భారతం, ప్రజా సాహితి తదితర పత్రికలలో ప్రచురింపబడ్డాయి. 2016 లో ‘సాదృశ్యం’ అనే కథాసంపుటిని వెలువరించారు. ప్రస్తుతం తన కవితా సంపుటిని వెలువరించే ప్రయత్నం చేస్తున్నారు.సిగ్నెట్- ఆఫీస్ మ్యాగజీనుకు (English) ఎడిటర్ గా ఒక సంవత్సరం అనుభవం.

పురస్కారాలు

1.శ్రీ సోమేపల్లి హనుమంతరావు గారి స్మృత్యర్ధం నిర్వహించిన చిన్న కధల పోటీలో ‘సాదృశ్యం’ అనే కధకు 2013 వ సంవత్సరంలో పురస్కారం.

2.’నవ్య’ వారపత్రిక, నాటా సంయుక్త నిర్వహణలో 2014లో నిర్వహించిన కవితల పోటీలో బహుమతి 

3.సాహితీ కిరణం, డా.పట్టాభి కళాపీఠం సంయుక్త నిర్వహణలో 2014 లోనిర్వహించిన కవితల పోటీలో తృతీయ బహుమతి 

4.కర్నాటక తెలుగు రచయితల సంఘం 2014 లో నిర్వహించిన కవితల పోటీలో ప్రత్యేక ప్రశంశా పత్రం

5.విడదల నీహారిక ఫౌండేషన్ వారి 2015 సంక్రాంతి కధలపోటీలో ‘యాత్ర’ కధకు ద్వితీయ బహుమతి.

6. సయ్యద్ సైదా సాహెబ్ స్మారక మినీ కవితల పోటీలో ప్రథమ బహుమతి,

7. మంచి కవితల విభాగంలోరంజని-కుందుర్తి బహుమతి -2016, మల్లెతీగ-2016 ఆత్మీయ పురస్కారం,

 

www.mytales.co.in  కథల పోటీలోబహుమతి లభించాయి. 

 

2017 లో అంపశయ్య నవీన్ లిటరరీ ట్రస్ట్, వరంగల్ వారి పురస్కారాన్ని(ప్రథమ బహుమతి)తన ప్రథమ నవల హరివిల్లుకు అందుకున్నారు.

 

చదువు: బి.ఇ(సివిల్ ఇంజనీరింగ్), ఎం.ఏ (ఇంగ్లిష్ లిటరేచర్), ( పిహెచ్డి ఆంగ్ల సాహిత్యంలో)

వృత్తి:  విజయవాడలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అసోసియేట్ ప్రొఫెసరుగా. అభిరుచులు: సంగీతం వినడం, టెన్నిస్ ఆడటం, ప్రయాణాలు చేయడం.

కుటుంబంశ్రీమతి: పద్మావతి, కుమార్తె: వైష్ణవి

 

శివ్  గారి   ( బి. వి. శివ ప్రసాద్ ) రచనలు

 

కథలు  

అ 

సిద్ధార్ధ      

సరాగం        

కధ చెప్పవా? 

కవితలు

అందరికీ... 

రైతు గజల్